HomeTelugu Big Storiesలాల్ సింగ్ చద్దా: నాగచైతన్య పాత్ర పరిచయం చేసిన మేకర్స్‌

లాల్ సింగ్ చద్దా: నాగచైతన్య పాత్ర పరిచయం చేసిన మేకర్స్‌

Naga Chaitanya Akkineni as
బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’. అద్వైత్ చందన్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాని టామ్ హంక్స్ నటించిన హాలీవుడ్ మూవీ `ఫారెస్ట్ గంప్` ఆధారంగా ఈ సినిమాని హిందీలో రీమేక్ చేశారు. అమీర్ ఖాన్ నటించి కిరణ్ రావు అజిత్ దేశ్ పాండే రాధికా చౌదరిలతో కలిసి సంయుక్తంగా నిర్మించారు. కరీనా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో టాలీవుడ్ హీరో నాగచైతన్య కీలక అతిథి పాత్రలో నటించారు. ఇదే తనకు తొలి బాలీవుడ్ మూవీ.

ఆగస్టు 11న భారీ స్థాయిలో హిందీతో పాటు తెలుగులోనూ విడుదల కాబోతోంది. తెలుగులో ఈ మూవీకి మెగాస్టార్ చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరిస్తుండగా గీతా ఆర్ట్స్ సంస్థపై అల్లు అరవింద్ విడుదల చేస్తున్నారు. సినిమా విడుదల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ని ప్రారంభించారు. ఇందులో భాగంగా నాగచైతన్య పాత్రకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. తాజాగా విడుదల చేసిన వీడియోలో నాగచైతన్య పాత్రని మలిచిన తీరు షూటింగ్ లో చైతో పాటు టీమ్ పడిన కష్టాన్ని చూపించారు. ఇందులో నాగచైతన్య బాలరాజు బోడి పాత్రలో కనిపించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu