HomeTelugu Trendingకండలు తిరిగిన దేహంతో నాగశౌర్య.. వైరల్‌

కండలు తిరిగిన దేహంతో నాగశౌర్య.. వైరల్‌

Naga shaurya 20 movie first

టాలీవుడ్ యంగ్‌ హీరో నాగశౌర్య 20వ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. రెండు రోజుల క్రితం తాను ఓ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమా తో వస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు శౌర్య. కాగా ఈ రోజు దర్శకుడు శేఖర్ కమ్ముల నాగశౌర్య సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేశాడు. సంతోష్‌ జాగర్లపూడి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో శౌర్య కండలవీరుడిగా కనిపించబోతున్నాడు. జుట్టు, గెడ్డం, కండలు తిరిగిన దేహంతో, చేతిలో విల్లు ఎక్కుపెట్టి కనిపిస్తున్న నాగశౌర్య లుక్‌ ఆకట్టుకుంటోంది. ప్రాచీన విలువిద్య నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై నారాయణ్‌ దాస్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్‌మోహన్‌ రావు, శరత్‌ మరార్‌ నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు కాల భైరవ సంగీతం అందిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu