Naga Vamsi’s Bold Bets Revealed!Naga Vamsi Movies:
టాలీవుడ్‌లో ప్రస్తుతం బిజీ బిజీగా ఉన్న నిర్మాత ఎవరో తెలుసా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగ వంశీ! ఇటీవల వరుస హిట్లు అందుకున్న ఆయన, ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయారు. ప్రస్తుతం ఆయన బ్యానర్‌లో దాదాపు పది సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. స్టార్ హీరోలు ఎన్‌టీఆర్‌తో పాటు మరోసారి విజయ్ దేవరకొండ, రవితేజ వంటి టాప్ హీరోలతో సినిమాలు చేస్తున్నారు.
ఇప్పటికే ఎన్‌టీఆర్ నటిస్తున్న దేవర సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను భారీ ధరకు తీసుకుని, విజయవంతంగా డిస్ట్రిబ్యూషన్ నిర్వహించారు. ఇప్పుడు ఆయనకు ముందున్న నెల చాలా కీలకం. ఎందుకంటే జూలై 31న విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ విడుదల కానుంది. ఈ సినిమా ఆయన కెరీర్‌లోనే అత్యంత ఖరీదైన సినిమా. ఈ సినిమాకి హైప్ అమాంతం పెరిగిపోయింది. ప్రమోషన్లు త్వరలోనే మొదలయ్యే అవకాశం ఉంది.
కింగ్‌డమ్ విడుదలై రెండు వారాలకే అంటే ఆగస్టు 14న ఎన్టీఆర్ నటించిన వార్ 2 థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాకి కూడా నాగ వంశీ తెలుగులో థియేట్రికల్ హక్కులు భారీగా కొనుగోలు చేశారు. ఇదే రోజు రజనీకాంత్ కూలీ సినిమా విడుదల అవుతోంది. అంటే కాస్త క్లాష్ కూడా ఉండబోతోంది. అయినా, పెద్ద స్థాయిలో రిలీజ్ చేయడానికి ప్లానింగ్ ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది.
ఇంకా అంతే కాకుండా ఆగస్టు 27న రవితేజ నటించిన మాస్ జాతర రిలీజ్ కాబోతోంది. ఇది మాస్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతుండగా, రవితేజ కెరీర్‌లో కీలకంగా మారే సినిమా అని తెలుస్తోంది.
ఒక నెల వ్యవధిలో నాగ వంశీకి మూడు పెద్ద సినిమాల రిలీజులు ఉండబోతున్నాయి. ఇవన్నీ హిట్ అయితే, భారీ లాభాలే ఆయన ఖాతాలో పడతాయి. ఇలా చూస్తే, ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌లో విజయవంతమైన నిర్మాతగా నిలిచిన వ్యక్తి ఖచ్చితంగా నాగ వంశీయే!













