బాహుబలి2 కి భారీ ఫంక్షన్!

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ‘బాహుబలి’ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో.. అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా పార్ట్ 2 రాబోతుంది. ఇప్పటికే బాహుబలి2 సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయింది. ఈ నెల 27వ తేదీన ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఆ తరువాత మరో మూడు, నాలుగు రోజుల్లో మిగిలిన ప్యాచ్ వర్క్ పూర్తి చేసి ఈ నెల 31 న గుమ్మడికాయ కొట్టనున్నారు.

ఇక ఆరోజుతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తయినట్లే.. గ్రాఫిక్స్ వర్క్ పై చిత్రబృందం పని చేయనుంది. కాబట్టి గుమ్మడికాయ కొట్టే రోజున భారీ స్థాయిలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరినీ ఈ కార్యక్రమానికి పిలవబోతున్నట్లు సమాచారం. ఇది కూడా పబ్లిసిటీలో భాగంగానే చిత్రబృందం ఏర్పాటు చేయబోతుందని చెప్పుకుంటున్నారు.