ఆ రీమేక్ పై చైతు ఆసక్తి!

గత కొన్ని రోజులుగా నాగచైతన్య బాలీవుడ్ లో వచ్చిన ‘టు స్టేట్స్’ సినిమా తెలుగు రీమేక్ లో నటించబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఈ విషయమై చైతుని ప్రశ్నించగా నా వరకు ఈ ప్రపోజల్ రాలేదని వస్తే ఖచ్చితంగా చేస్తానని చెప్పుకొచ్చాడు.

అయితే తాజాగా ఈ కథలో చేసిన కొన్ని మార్పులు, చేర్పులు చేసి చైతుకి వినిపించినట్లు సమాచారం. వినాయక్ దగ్గర
శిష్యరికం చేసిన వెంకట్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. వెంకట్ రెడ్డి తెలుగు వెర్షన్ చైతుకి నచ్చడంతో ఈ కథను సినిమాగా చేయాలనే విషయంలో ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.

ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో ఇలా వరుస హిట్స్ కొడుతోన్న చైతుకి ఈ కథ కరెక్ట్ అనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తే చైతు లిస్ట్ లో మరో హిట్ ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో చైతు సరసన సమంతను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారు. ఈ విషయాల గురించి మరిన్ని
వివరాలు తెలియాల్సివుంది.