ఆత్మీయుడి మరణంపై విచారం వ్యక్తం చేసిన బిగ్‌బీ


బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ తన ఆత్మీయుడు మృతిపై విచారం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ రాజకీయ వేత్త రాజ్యసభ ఎంపీ, ఉత్తరప్రదేశ్‌లో సమాజ్ వాదీ పార్టీ వెన్నుదన్నుగా నిలిచిన అమర్ సింగ్ తీవ్ర అనారోగ్యంతో నిన్న కన్నుమూశారు. ఆయన వయసు 64 ఏళ్లు. ఆయన గత కొన్ని రోజులుగా సింగపూర్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన మృతిపై దేశ వ్యాప్తంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఒకప్పడు అమర్ సింగ్ ఎంతో సన్నిహితంగా మెలిగిన్ అమితాబ్ బచ్చన్ ఓ ఫోటోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోకు ఎలాంటి క్యాప్షన్ రాయకుండా పోస్ట్ చేసారు. అయితే ఈ ఫోటోను అమితాబ్ బచ్చన్ తనకు సన్నిహితుడైన అమర్ సింగ్‌కు గుర్తుకు తెచ్చుకొని ఈ ఫోటోను షేర్ చేసి ఉంటారని భావిస్తున్నారు.

ఈ ఫోటోలో అమితాబ్ బచ్చన్ తల దించుకొని బ్లాక్ అండ్ వైట్ దుస్తుల్లో నివాళులు అర్పిస్తున్నట్టు ఉన్న ఫోటోను షేర్ చేసారు. ఇక బిగ్‌బీ విషయానికొస్తే.. ప్రస్తుతం ఈయన నానావతి హాస్పటిల్‌లో కోవిడ్-19కు చికిత్స తీసుకుంటున్నారు. అమితాబ్ బచ్చన్ కూడా త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని ఆయన అభిమానులు ప్రార్ధనలు చేస్తున్నారు.

 

CLICK HERE!! For the aha Latest Updates