విరించి వర్మతో నాగార్జున.. ఛాన్సే లేదట!

నిన్న టాలీవుడ్ లో యంగ్ డైరెక్టర్ విరించి వర్మతో నాగార్జున సినిమా చేస్తున్నాడనే వార్త హల్ చల్ చేసింది. గతంలో విరించి డైరెక్ట్ చేసిన ‘ఉయ్యాలా జంపాలా’ సినిమాకు ఒక నిర్మాతగా నాగార్జున వ్యవహరించడంతో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశముందని అంతా అనుకున్నారు. అయితే ఆ సినిమా సమయంలోనే విరించి.. నాగార్జునతో సినిమా చేయాలనుకున్నాడట కానీ అది వర్కవుట్ కాలేదు. ఆ తరువాత నాని హీరోగా ‘మజ్ను’ లాంటి ట్రైయాంగిల్ లవ్ స్టోరీను తెరకెక్కించి సక్సెస్ అందుకున్నాడు.
అయితే త్వరలోనే విరించి, నాగార్జునతో సినిమా చేస్తున్నాడనే ప్రచారం ఊపందుకుంది. ఈ వార్తల్లో అసలు నిజం లేదని తేల్చేశాడు ఈ యంగ్ డైరెక్టర్. తను ఇద్దరు యంగ్ హీరోలకు కథలు వినిపించే పనిలో ఉన్నానని, ప్రస్తుతానికి నాగార్జున గారికి సరిపడే కథ తన దగ్గర లేదని ఆయనతో సినిమా చేయబోతున్నాననే వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇద్దరు హీరోల కోసం ప్రయత్నిస్తున్నానని వారిలో ఎవరోకరు ఫైనల్ అయిన వెంటనే అధికారికంగా వెల్లాడిస్తానని తెలిపారు.