HomeTelugu News25న ''అమ్మమ్మగారిల్లు''

25న ”అమ్మమ్మగారిల్లు”

హీరో నాగశౌర్య, షామిలి జంటగా స్వాజిత్ మూవీస్ బ్యానర్లో తెరకెక్కుతోన్న చిత్రం ”అమ్మమ్మగారిల్లు”. శ్రీమతి స్వప్న సమర్పణలో కేఆర్ సహా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుందర్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 25న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సెన్సార్ క్లీన్ యు సర్టిఫికెట్ లభించిందని నిర్మాతలు తెలిపారు. చిత్రం టీజర్ ను చూసి పలువురు సినీ పెద్దలు మెచ్చుకున్నారని అన్నారు. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయని తెలిపారు.

1 2

ఇప్పటికే విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించిందని కుటుంబ సమేతంగా చూడదగ్గ చక్కని సినిమా తీశారని, తమ చిన్ననాటి సంగతులు గుర్తుకొచ్చాయని నెటిజన్లు కామెంట్ల రూపంలో తెలిపారని నిర్మాతలు అన్నారు. ఇప్పటికే సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న మా సినిమాకు సెన్సార్ బృందం నుంచి ప్రశంసలు లభించాయని అన్నారు. చక్కని కుటుంబ కథా చిత్రమని అందులో భావాలు, భావోద్వేగాలు హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయన్న సెన్సార్ టీమ్ ప్రశంసలు ఆనందాన్నిచ్చాయని నిర్మాతలు తెలిపారు. తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu