HomeTelugu Trendingపవన్‌ కల్యాణ్‌ రీట్వీట్‌.. ఆనందంలో టాలీవుడ్‌ హీరోలు

పవన్‌ కల్యాణ్‌ రీట్వీట్‌.. ఆనందంలో టాలీవుడ్‌ హీరోలు

Tollywood heroes happy with
టాలీవుడ్‌ నటుడు సత్యదేవ్ వైవిధ్యభరితమైన పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రం కూడా ప్రేక్షకుల ఆదరణ పొందింది. మరోవైపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సత్యదేవ్ శుభాకాంక్షలు తెలిపాడు. సత్యదేవ్ ట్వీట్ పై పవన్ స్పందించాడు. ‘థాంక్యూ సత్యదేవ్ గారు. మీ తాజా చిత్రం ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’లో మీ పర్ఫామెన్స్ ను చాలా ఎంజాయ్ చేశా. ఆల్ ది బెస్ట్’ అని ట్వీట్ చేశారు. పవన్ స్పందనపై సత్యదేవ్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ‘ధన్యవాదాలు సార్. మీ బర్త్ డే సందర్భంగా మీరు ఇచ్చిన బహుమతిని మర్చిపోలేను. మీ ట్వీట్ తో మా ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ టీమ్ మొత్తం సంతోషపడుతోంది’ అని సత్యదేవ్ ట్వీట్ చేశారు.

అలాగే ఆర్ ఎక్స్100 హీరో కార్తికేయ కూడా పవన్‌ కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కార్తికేయ పోస్ట్ కు పవన్ రిప్లై ఇస్తూ అతడిని ‘సార్’ అని సంబోధించాడు. ఇక పవర్ స్టార్ తనను సార్ అని పిలవడం పై షాక్ అయిన కార్తికేయ తన ట్విట్టర్ లో.. ”సార్ సార్ …. సార్ ఏంటి సార్ .. నేను మీ లక్షల మంది అభిమానులలో ఒకడిని. మీరు రిప్లై ఇవ్వడమే నాకు ఎంతో గొప్ప విషయం.. మీ పుట్టినరోజునాడు నాకు ఎప్పటికీ మర్చిపోలేని రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు. ధన్యవాదాలు సార్. ఇది నన్ను సూపర్ సూపర్ హ్యాపీ చేసింది” అని తెలిపాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu