నాని 24వ సినిమా .. ‘అమ్మాయిలు ఇది మీ కోసమే’

నేచ్యురల్‌ స్టార్‌ నాని ప్రస్తుతం జెర్సీ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా నాని తన తదుపరి చిత్రాన్నికూడా ప్రకటించాడు. చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నట్టుగానే విభిన్న చిత్రాల దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తన 24వ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించాడు నాని.

ఇష్క్‌, మనం, 24, హలో లాంటి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన విక్రమ్‌ కుమార్‌ లాంగ్ గ్యాప్ తరువాత మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. చాలా రోజులుగా విక్రమ్‌, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందన్న టాక్ వినిపించింది. అయితే బన్నీ , త్రివిక్రమ్‌తో సినిమా చేసేందుకు ఇంట్రస్ట్‌చూపిస్తుండటంతో విక్రమ్‌, నానితో సినిమా చేసేందుకు రెడీ అయ్యారు.

మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ పోస్టర్‌ను విభిన్నంగా డిజైన్‌ చేశారు. ఓ పిట్టగోడ మీద నాని, విక్రమ్‌లో టీ తాగుతున్న చర్చించుకుంటున్న ఫొటోను ‘నేను, విక్రమ్‌ ఇంకా ఆ మిగతా ఐదుగురు వచ్చే సంవత్సరంలో.. అమ్మాయిలు ఇది మీ కోసమే’ అనే కామెంట్‌తో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా ఫిబ్రవరి 19న ప్రారంభ కానుంది.

CLICK HERE!! For the aha Latest Updates