
Nani Hit 3 OTT Release Date:
నేచురల్ స్టార్ నాని నటించిన హిట్ 3 (HIT: The Third Case) ఎంతటి సక్సెస్ అయిందో తెలియని వాళ్లే లేరంటే అతిశయోక్తి కాదు. సినిమాకు వచ్చిన రెస్పాన్స్ అన్నదే వేరే లెవెల్లో ఉంది. థియేటర్లలో భారీగా ఆడిన ఈ సినిమా, నాని కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. దాదాపు రూ. 120 కోట్లు కలెక్షన్స్‌ను రాబట్టి టాలీవుడ్‌కు ఊపిరి తీసుకునేలా చేసింది.
సైలేష్ కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు ఓపెనింగ్స్ అదిరిపోయాయి. కథలోని ఇంటెన్సిటీ, హింసాత్మక సన్నివేశాలు, నాని పెర్ఫార్మెన్స్ – అన్నీ కలిపి ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించాయి. ఇదే చిత్రంలో కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కూడా ప్రత్యేకతగా నిలిచింది.
ఇప్పుడు ఈ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీ లో కూడా సందడి చేయబోతోంది. నెట్‌ఫ్లిక్స్ తాజాగా ‘Coming Soon’ సెక్షన్‌లో మే 29న స్ట్రీమింగ్ అవుతుందని కన్‌ఫర్మ్ చేసింది. సోషల్ మీడియాలో అధికారికంగా ఎలాంటి పోస్టింగ్ లేకపోయినా, ఈ సమాచారం నెట్‌ఫ్లిక్స్ యాప్ లో కనిపిస్తోంది.
ఈ సినిమా తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతుందని సమాచారం. వాల్ పోస్టర్ సినిమాస్ మరియు యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై నాని, ప్రసాంతి తిపిర్నేని కలిసి నిర్మించిన ఈ సినిమాలో మ్యూజిక్ మిక్కీ జే మేయర్ అందించారు.
ALSO READ: అదుర్స్ నటుడు Mukul Dev అకాల మరణం!