HomeTelugu Trendingమెగాఫోన్‌ పట్టిన నాని అక్క

మెగాఫోన్‌ పట్టిన నాని అక్క

Hero nanis sister deepthi

న్యాచురల్‌ స్టార్‌ నాని హీరోలు సోదరి గంటా దీప్తి మెగాఫోన్‌ పట్టేసింది. గతంలో ‘అనగనగా ఒక నాన్న’ అనే షార్ట్‌ఫిల్మ్‌ను దీప్తి తీసి అందరి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా నాని సొంత బేనర్ వాల్ పోస్టర్ సినిమాలో ప్రశాంతి నిర్మాతగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి మీట్ క్యూట్ అనే టైటిల్ ఫిక్స్‌ చేశారు. నిన్న ఈ సినిమా గురించి అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. అ! హిట్ సినిమాల తర్వాత ఈ బేనర్లో తెరకెక్కుతున్న రెండు చిత్రాల్లో ఇదొకటి. ఇప్పటికే హిట్-2 సినిమాను అనౌన్స్ చేయగా.. ఇప్పుడు మీట్ క్యూట్ గురించి వెల్లడించారు.

ఈ సినిమా గురించి ప్రకటిస్తూ దర్శకురాలిగా గంటా దీప్తి పేరును ప్రకటించడంతో చాలామందికి ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే గంటా అనేది నాని ఇంటి పేరు. కాబట్టి గంటా దీప్తి అంటే నాని కుటుంబ సభ్యురాలే అయ్యుంటుందనిపించింది. ఆమె గురించి ఆరా తీస్తే నాని సొంత అక్క అని వెల్లడైంది. మీట్ క్యూట్ ఒక ప్రయోగాత్మక లేడీ ఓరియెంటెడ్ మూవీ అంటున్నారు. తక్కువ బడ్జెట్లో పరిమిత కాస్ట్ అండ్ క్రూతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారట. ఇందులో తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నివేథా థామస్ చేస్తున్నట్లు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!