HomeTelugu Trendingకృష్ణ శ్వాస తీసుకోగలుగుతున్నారు: నరేశ్‌

కృష్ణ శ్వాస తీసుకోగలుగుతున్నారు: నరేశ్‌

naresh about superstar kris
సూపర్ స్టార్ కృష్ణ అనారోగ్యంతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనకు వైద్యులు చికిత్స కొనసాగిస్తున్నారు. కృష్ణ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కుమారుడు, నటుడు నరేశ్‌ అన్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో నరేశ్‌ మీడియాతో మాట్లాడుతూ..కృష్ణ శ్వాస తీసుకోగలుగుతున్నారు. మరో 48 గంటలు గడవాలని డాక్టర్లు చెబుతున్నారు అన్నారు.

కృష్ణ త్వరలోనే కోలుకుని ఆరోగ్యంగా తిరిగొస్తారని ఆశిస్తున్నాం. కృష్ణగారు రీల్‌ లైఫ్‌, రియల్ లైఫ్‌లో చాలా డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్‌. ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని అభిమానులంతా ఆ దేవుడిని ప్రార్థించాలని నరేశ్ కోరారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!