నరేష్ ఖాతాలో హిట్ పడేలా ఉందే..?

ఒకప్పుడు అల్లరి నరేష్ సినిమా అంటే కుటుంబం మొత్తం థియేటర్ కు వెళ్ళి సినిమా చూసి
కడుపుబ్బా నవ్వుకునే వారు. నరేష్ సినిమా అంటే మినిమమ్ గ్యారంటీ అనే నమ్మకం నిర్మాతలకు
ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో నరేష్ కు ఏది పెద్దగా కలిసి రావట్లేదు. దెబ్బ మీద దెబ్బ పడుతూనే
ఉంది. సుడిగాడు సినిమా తరువాత దాదాపు పది సినిమాల్లో నటించిన నరేష్ కు ఒక్క సినిమా
కూడా హిట్ ను ఇవ్వలేకపోయింది. ఇప్పుడు తన కెరీర్ కు ఓ హిట్ సినిమా ఎంతైనా అవసరం.
దీంతో తనకు సీమశాస్త్రి, సీమటపాకాయ్ వంటి హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డిని
నమ్ముకున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో హారర్ నేపధ్యంలో సాగే హిళారియస్ ఎంటర్టైన్మెంట్ ను
రూపొందిస్తున్నారు. అదే ‘ఇంట్లో దెయ్యం నాకేం భయం’ చిత్రం. ఇటీవల విడుదలయిన ఈ సినిమా
ట్రైలర్ చూస్తుంటే.. ఈసారి ఖచ్చితంగా అల్లరోడి ఖాతాలో హిట్ పడేలా ఉంది. ఆధ్యంతం కామెడీతో
నిండిపోయిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ నెల 11న సినిమాను విడుదల చేయడానికి
సన్నాహాలు చేస్తున్నారు.