ఆ టైటిల్ కే బాలయ్య వోటు!

ప్రస్తుతం పూరిజగన్నాథ్ దర్శకత్వంలో ‘పైసా వసూల్’ అనే సినిమా చేస్తోన్న బాలయ్య తన 102వ సినిమాకు సంబంధించిన పనులు కూడా మొదలుపెట్టేశాడు. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమా కోసం ‘రెడ్డి గారు’,’జయసింహా’ అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ రెండు పేర్లలో బాలయ్య ‘జయసింహా’ అనే టైటిల్ వైపు మొగ్గు చూపుతున్నారని సమాచారం.

గతంలో ఇదే పేరుతో సీనియర్ ఎన్టీఆర్ సినిమా చేసి సక్సెస్ అందుకోవడం, సింహా అనే టైటిల్ బాలయ్యకి కలిసొస్తుండడంతో ఈ టైటిల్ నే తన సినిమాకు పెట్టాలని భావిస్తున్నాడు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్ గా నయనతార కనిపించనుంది. దీనికోసం అమ్మడుకి మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ ముట్టజెప్పినట్లు తెలుస్తోంది.