సినిమా పూర్తి కాలేదు.. అప్పుడే సీక్వెల్‌ అంటున్న పూరి

దర్శకుడు పూరి జగన్నాద్‌ సినిమాల విషయంలో జోరు తగ్గకుండా ఒకదాని వెంట మరోటి పట్టాలెక్కిస్తున్నాడు. ప్రస్తుతం రామ్‌ హీరోగా ఇస్మార్ట్‌ శంకర్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరుగుతుండగా.. ఈ మూవీ సీక్వెల్‌ పార్ట్‌కు సంబంధించిన టైటిల్‌ను రిజిష్టర్‌ చేసినట్టు తెలుస్తోంది. ఇస్మార్ట్‌శంకర్‌పై విజయం సాధిస్తుందన్న నమ్మకంతోనే.. డబుల్‌ఇస్మార్ట్‌ అనే సీక్వెల్‌ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్.. పూరి జగన్నాధ్ టాకీస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.