
సూపర్ స్టార్ మహేశ్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కబోతోన్న సంగతి తెలిసిందే మహేశ్ తో త్రివిక్రమ్ చేస్తున్న మూడో సినిమా ఇది. దాంతో సినిమాపై అవచనాలు సహజంగానే భారీగా పెరిగాయి. త్రివిక్రమ్ కు సహజంగానే ఓ అలవాటు ఉంది. తన సినిమాల్లో స్టార్ హీరోతో పాటు మరో యంగ్ హీరోను తీసుకుంటాడు.
ఇక త్వరలోనే ఈమూవీ సెట్స్‌పైకి రానున్న నేపథ్యంలో ఓ ఆసక్తికర అప్‌డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.. ఈ సినిమాలో ఓ తెలుగు స్టార్ హీరో అతిథి పాత్రలో కనిపించనున్నాడని టాక్. ఆయన ఎవరో కాదు నేచురల్ స్టార్ నాని. ఈ సినిమాలో ఓ కీ రోల్ కోసం నానిని సంప్రదించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై క్లారిటీ రావాలంటే ఈ మూవీ సెట్‌పైకి వచ్చేవరకు వేచి చూడాల్సిందే.













