జర్నలిస్ట్ గా నయనతార!

నయనతార.. ఈ భామ ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు పదేళ్ళు దాటుతోంది. అయినా.. ఇప్పటికీ క్రేజీ ఆఫర్స్ తో బిజీ హీరోయిన్ గా తన హవా సాగిస్తోంది. అటు అగ్ర హీరోల సరసన జత కడుతూనే.. ఇటు కుర్ర హీరోల సినిమాల్లోనూ నటించేస్తోంది. తాజాగా ఈ భామ భరత్ కృష్ణమాచారి చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదొక లేడీ ఓరియెంటెడ్ సినిమా అని సమాచారం. ఈ సినిమాలో నయన్ ఓ జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతోంది.

ఫ్రాన్స్ లో జర్నలిస్ట్ గా పనిచేసే ఆమెకి ఒకానొక సంధర్భంలో తన పుట్టు పూర్వోత్తరాల గురించి తెలుసుకోవాలనుకుంటుంది. దానికోసం అనేక దేశాలు తిరుగుతుంది. చివరగా కథ తమిళనాడులో ముగుస్తుంది. కథను బట్టి సినిమాను ఇండియాతో పాటు ఫ్రాన్స్, జర్మనీ, పోలండ్, మంగోలియా వంటి ప్రాంతాల్లో చిత్రీకరించనున్నారు. ఈ సినిమా నయన్ పై కొన్ని యాక్షన్ సీన్స్ కూడా ఉన్నట్లు సమాచారం. దీనికోసం ఆమె ప్రత్యేక శిక్షణ తీసుకోవాలని ప్లాన్ చేస్తోంది. గతంలో వచ్చిన ‘కృష్ణంవందే జగద్గురుం’ సినిమాలో కూడా నయనతార జర్నలిస్ట్ తరహా పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.