వినాయక్ డైరెక్షన్ లో మరో మెగాహీరో!

‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో తన ఖాతాలో పెద్ద హిట్ వేసుకున్న వి.వి.వినాయక్ ఇప్పుడు మరో మెగాహీరోను డైరెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం. గతంలో రామ్ చరణ్, అల్లు అర్జున్ లతో సినిమాలు చేసిన వినాయక్ ఇప్పుడు సాయి ధరం తేజ్ ను డైరెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. మాస్ లో.. యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న సాయి ధరం తేజ్ ను వినాయక్ బాగా ఎలివేట్ చేయగలడని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన చర్చలు ముగిసినట్లు టాక్. త్వరలోనే ఈ విషయానికి సంబంధించిన అధికార ప్రకటన వెలువడనుంది. ఇది కూడా వినాయక్ స్టయిల్ లో ఉండే పక్కా కమర్షియల్ సినిమా అని చెబుతున్నారు. సాయి ధరం తేజ్ ఇప్పటివరకు మాస్ కమర్షియల్ సినిమాలతోనే ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇప్పుడు మరోసారి తన క్రేజ్ ను చూపించడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం తను నటించిన ‘విన్నర్’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈలోగా వినాయక్ పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసి సెట్స్ పైకి వెళ్లనున్నారు.