నయన్ డెసిషన్ కరెక్టేనా..?

కెరీర్ మొదట్లోనే సూపర్ రజినీకాంత్, మమ్ముట్టి వంటి స్టార్ హీరోల సరసన నటించిన హీరోయిన్ నయనతార ఇప్పుడు ఓ కమెడియన్ తో కలిసి వెండితెరకు పంచుకోబోతోందట. ఈ విషయం విన్న కొందరు నయన్ మంచి నిర్ణయం తీసుకుందని మెచ్చుకుంటుంటే.. మరికొందరు మాత్రం నయన్ పెద్ద రిక్స్ చేస్తోందని అంటున్నారు. అసలు విషయంలోకి వస్తే.. ఓ యువదర్శకుడు నయన్ అలానే స్టార్ కమెడియన్ సూరిలతో ఓ సినిమా చేయాలనుకున్నాడు.

ఈమేరకు కథ సిద్ధం చేసి నయన్ కు వినిపించాడట. దానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు. ఈ సినిమాకు గానూ నయనతారకు మూడు కోట్ల రెమ్యూనరేషన్ ఇస్తానని హామీ ఇచ్చారట. అందుకే ఆమె అంగీకరించిందని టాక్. గతంలో శ్రియ హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్నప్పుడు కమెడియన్ వడివేలుతో కలిసి ఓ పాటలో నటించింది. ఆ పాట ఆమె కెరీర్ ను మరింత దెబ్బ తీసిందని చెబుతారు. మరి నయన్ విషయం ఏం జరుగుతుందో..?