HomeTelugu TrendingNBK 109: సింహం నక్కల మీదకు వస్తే వార్ అవ్వదురా లఫుట్

NBK 109: సింహం నక్కల మీదకు వస్తే వార్ అవ్వదురా లఫుట్

NBK 109 First Glimpse
NBK 109: నందమూరి బాలకృష్ణ వరుస హిట్‌లతో ఫుల్ జోష్‌లో ఉన్నాడు. తాజాగా బాలకృష్ణ 109వ సినిమా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ బ్యానర్స్ పై నాగవంశీ, సౌజన్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

ఈ రోజు మహా శివరాత్రి సందర్భంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లో అగ్నిలావాలా పొంగుతున్నట్టు చూపించి బాలయ్యబాబు ఎంట్రీ ఇచ్చాడు. విలన్ – ఏంట్రా వార్ డిక్లేర్ చేస్తున్నావా అంటే బాలయ్య – సింహం నక్కలా మీదకు వస్తే వార్ అవ్వదురా లఫుట్.. హంటింగ్ అంటారు అని పవర్ ఫుల్ గా చెప్పి యాక్షన్ సీన్ తో అదరగొట్టాడు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ వీడియో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో బాలయ్య సరికొత్త లుక్ లో మరింత యంగ్ గా కనపడ్డారు.

ఇటీవల శరవేగంగా షూటింగ్ జరిగిన ఈ సినిమా ప్రస్తుతం బ్రేక్ తీసుకుంది. ఎలక్షన్స్ దగ్గరికి వస్తుండటంతో బాలయ్య బాబు ఆ బిజీలో ఉండి షూట్ కి కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చినట్టు సమాచారం. ఈ సినిమా 1980లో స్టోరీతో, ఫుల్ యాక్షన్ గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. వయోలెన్స్ కి విజిటింగ్ కార్డు, ప్రపంచానికి ఇతను తెలుసు, కానీ ఇతని ప్రపంచం ఎవ్వరికి తెలీదు అనే కొటేషన్ తో సినిమా ఓపెనింగ్ సమయంలో ఓ పోస్టర్ ని రిలీజ్ చేసి అంచనాలు పెంచారు.

 

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu