Homeతెలుగు Newsబాలకృష్ణ 109వ సినిమా అప్డేట్‌

బాలకృష్ణ 109వ సినిమా అప్డేట్‌

nbk 109 movie update

నందమూరి బాలకృష్ణ మంచి జోష్‌లో ఉన్నాడు. భగవంత్ కేసరి సినిమాతో హ్యాట్రిక్ విజయాలు అందుకున్న బాలయ్యకు సంబంధించి మరో లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది. యంగ్‌ డైరెక్టర్‌ బాబీతో తన 109వ సినిమాను ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించి మరో లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది.

నేడు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి బాబీ ట్వీట్‌ ద్వారా అప్‌డేట్‌ అందించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. గొడ్డలికి కళ్లజోడు పెట్టినట్టు ఉన్న ఈ పోస్టర్ చూస్తుంటేనే ఇది పూర్తిగా మాస్ మసాలా మూవీ అని అర్థమవుతోంది.

గొడ్డలిపైన ఆంజనేయస్వామి బిళ్ల కూడా ఉంది. కళ్లద్దాల ప్రతిబింబంలో రాక్షసుడిపైకి నరసింహస్వామి దూకుతున్నట్టుగా ఉంది. ఈ పోస్టర్‌ను షేర్ చేసిన బాబీ.. ‘బ్లడ్ బాత్ కా బ్రాండ్ నేమ్’, ‘వయలెన్స్‌ కా విజిటింగ్‌ కార్డ్‌’ అని క్యాప్షన్ రాసుకొచ్చారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!