HomeTelugu Trending'నీవేనా నీవేనా' వీడియో సాంగ్‌

‘నీవేనా నీవేనా’ వీడియో సాంగ్‌

Neevena Neevena Full Video 1 1క్లాప్‌బోర్డ్ ప్రొడక్షన్‌లో కన్నడ సూపర్‌ హిట్‌ మూవీ తెలుగులో ‘దియా’ పేరుతో వస్తున్న సంగతి తెలిసిందే. ఖుషి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి విభ కశ్యప్ దర్శకత్వం వహిస్తున్నాడు .ఆర్‌కె నల్లం, రవి కశ్యప్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కాగా ఇప్పటికే విడుదలైన ‘నీవేనా నీవేనా’ లిరికల్ వీడియో సాంగ్‌ ఆకట్టుకుంది.

తాజాగా ‘నీవేనా నీవేనా’ వీడియో సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. ఈ పాటకు అజనీష్‌ లోకనాథ్‌ సంగీతం అందించారు. లిరిక్స్‌ పూర్ణ చారి అందించగా నూతన మోహన్‌, నరసింహ ఆలపించారు.ఇది ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగాయి. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu