HomeTelugu Big Storiesఎమోషనల్‌గా 'దియా' ట్రైలర్‌

ఎమోషనల్‌గా ‘దియా’ ట్రైలర్‌

Diya movie Trailer image
కన్నడలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన దియా సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది క్లాప్‌ బోర్డ్‌ ప్రొడక్షన్స్‌. పృథ్వీ అంబర్, ఖుషి హీరో, హీరోయిన్‌లుగా నటించిన ఈ సినిమా తెలుగు వెర్షన్‌కు ఆర్కే నల్లం, రవి కశ్యప్ నిర్మాతలు. ఎంతోమంది ప్రేక్షకుల కోరిక మేరకు ఒరిజినల్‌కు ఏమాత్రం తగ్గకుండా అదేస్థాయిలో ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రి-రిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌ ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఎంతో ఎమోషనల్‌గా సాగిన ఈ ట్రైలర్‌ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. కాగా ఈ సినిమా ఆగస్టు 19న డిజిటల్‌ వేదికగా విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu