నెగెటివ్ రోల్స్ చేయాలనుంది!

ఊహలు గుసగుసలాడే చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయిన నటి రాశిఖన్నా. ఆ
చిత్రంలో తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్న ఈ భామ ఆ తరువాత వరుస చిత్రాలతో బిజీగా
మారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న ఈ బ్యూటీకి
నెగెటివ్ రోల్ లో నటించాలని ఉందట. నాలో అసలైన ఆర్టిస్ట్ ను బయటకు తీసుకురావాలని
ఉంది.. నెగెటివ్ రోల్ లో నటిస్తేనే అలాంటి అవకాశం ఏర్పడుతుంది. అలాంటి రోల్స్ నాకు
ఎవరైనా ఆఫర్ చేస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నాను. నటిగా ఆ పాత్రను చాలెంజింగ్ గా
తీసుకొని నా సత్తా ఏంటో చూపిస్తానంటోంది ఈ చిన్నది. నిజానికి కొందరు రాశికి నెగెటివ్
రోల్స్ సెట్ కావని అనడంతో ఎలాంటి పాత్రలో అయినా నేను నటించగలననే విషయాన్ని
నిరూపిస్తానని ఛాలెంజ్ చేస్తోంది. ప్రస్తుతం రాశి, గోపిచంద్ సరసన ‘ఆక్సిజన్’ సినిమాలో
నటిస్తోంది.