HomeTelugu Trendingనేను స్టూడెంట్‌ సర్‌' రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

నేను స్టూడెంట్‌ సర్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

nenu student sir release da

యాక్టర్ బెల్లంకొండ గణేశ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘నేను స్టూడెంట్‌ సర్‌’. ఈ సినిమాకి రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. అవంతిక దస్సానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే విడుదల కావల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా కొత్త విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్‌.

జూన్‌ 2న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ కొత్త లుక్‌ ఒకటి విడుదల చేశారు. యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తున్న ఈ చిత్రంలో టాలెంటెడ్‌ యాక్టర్‌ కమ్‌ డైరెక్టర్‌ సముద్రఖని పోలీసాఫీసర్‌ అర్జున్‌ వాసుదేవన్‌ పాత్రలో నటిస్తున్నాడు. సునీల్‌ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

ఈ చిత్రాన్ని ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నాంది ఫేం సతీశ్‌ కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. మహతి స్వరసాగర్‌-అనిత్‌ మదాడి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్‌, చరణ్‌ దీప్‌, ఆటో రాంప్రసాద్, ప్రమోదిని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌తోపాటు పాటలను కూడా మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రం రాఖీ ఉప్పలపాటికి దర్శకుడిగా తొలి సినిమా కాగా.. ఈ మూవీకి కృష్ణ చైతన్య కథనందించాడు.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu