నెరుప్పుడా’లో అతిథిగా రజినీకాంత్!

‘కబాలి’ చిత్ర్హంతో ప్రేక్షకులను అలరించిన రజినీకాంత్ ఆ చిత్రం దర్శకుడు రంజిత్ తోనే మరో సినిమా
చేయడానికి సిద్ధమవుతున్నాడు. అలానే శంకర్ దర్శకత్వంలో ‘రోబో2’ సినిమాలో నటిస్తున్నాడు.
అయితే తాజాగా ఆయన ఓ సినిమాలో అతిథి పాత్రలో కనిపించడానికి రెడీ అవుతున్నాడని
సమాచారం. ప్రముఖ నటుడు శివాజీ గణేషన్ మనువడు, నటుడు ప్రభు తనయుడు అయిన
విక్రమ్ ప్రభు హీరోగా నటిస్తోన్న చిత్రం ‘నెరుప్పుడా’. కబాలి సినిమాలో టైటిల్ సాంగ్ లోని పదం
ఇది. నిజానికి ఈ సినిమాలో హీరో రజినీకాంత్ ఫ్యాన్ గా కనిపించనున్నాడు. అందుకే టైటిల్ కూడా
నెరుప్పుడా అని ఫైనల్ చేశారు. సినిమాలో ఓ సంధర్భంలో హీరోకి రజినీకాంత్ కనిపిస్తాడు. ఆ
పాత్రలో నిజంగానే రజినీకాంత్ ఆయన్ను సంప్రదించగా వెంటనే రజిని ఓకే చెప్పేశారు. దానికి
కారణం ఆయనకు, శివాజీ కుటుంబానికి ఉన్న అనుబంధం అలాంటిది. శివాజీ, ప్రభులతో కలిసి
రజినీకాంత్ చాలా సినిమాల్లో నటించారు.

CLICK HERE!! For the aha Latest Updates