
Ambani Wedding Cost:
ముఖేష్ అంబానీ రెండవ తనయుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల పెళ్లి జులై 12 న అంగరంగ వైభవంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది సెలబ్రిటీలు ఈ వేడుకలో పాలు పంచుకున్నారు. సినిమా సెలబ్రిటీల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ ఈ పెళ్ళికి హాజరయ్యారు.
అయితే తాజాగా ముఖేష్ అంబానీ ఈ పెళ్లి కోసం 5000 కోట్లు ఖర్చుపెట్టినట్టు వార్తలు బయటకు వచ్చాయి. అది ముఖేష్ అంబానీ నెట్ వర్త్ లో కేవలం 0.5% మాత్రమే. నిజానికి అందరూ ఈ పెళ్లి కోసం ముఖేష్ అంబానీ 1000 నుంచి 2000 కోట్లు ఖర్చు పెడతారు అని అనుకున్నారు. కానీ 5000 కోట్లు ఖర్చయింది అని తెలియడంతో.. మామూలు ప్రజలు కూడా అంత పెద్ద అమౌంట్ విని ముక్కుని వేలేస్తున్నారు.
ఈ విషయం గురించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఇంటర్నెట్ లో దీనికి సంబంధించి ఎన్నో మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అంబానీ పెళ్లి కోసం ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టారు అని వార్త కింద అందరూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
5000 కోట్లు అంటే ఒక కుటుంబంలోని ఐదు జనరేషన్లు సంతోషంగా బతికేస్తాయి అని కామెంట్ చేశారు. మరొకరు అమెరికన్ కరెన్సీ ప్రకారం చూస్తే 5000 కోట్లు అంటే దాదాపు 600 మిలియన్ డాలర్లు. దీంతో అమెరికా 10 సార్లు ఆస్కార్ ఈవెంట్లు హోస్ట్ చేయొచ్చు అంటూ కామెంట్ చేసారు.
మరొక ఆర్టికల్ ప్రకారం అంబానీలు రోజుకి మూడు కోట్ల చొప్పున ఖర్చు పెట్టినా కూడా వాళ్ళ ఆస్తి మొత్తం పూర్తిగా అయిపోవడానికి 962 ఏళ్లు పడుతుంది అని పోస్ట్ చేయగా, దానికి ఒక నెటిజన్ అందులో వాళ్ళు రోజు మొత్తం ఖర్చు పెట్టే మూడు కోట్లు ఇస్తే మేము ఒక జనరేషన్ మొత్తం బతికేస్తాము అని ఫన్నీగా రిప్లై ఇచ్చారు.
యూకే మాజీ ప్రైమ్ మినిస్టర్ బోరిస్ జాన్సన్, కిన్ కర్దాషియన్, సామ్సంగ్ సీఈవో హాన్ జాన్ వంటి గ్లోబల్ సెలబ్రిటీలు కూడా ముంబైలో జరిగిన అనంత అంబానీ పెళ్లికి హాజరయ్యి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ వేడుకకి హాజరైన సంగతి తెలిసిందే.













