
Vijay Deverakonda – Rashmika Mandanna:
ఇటీవల విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో రష్మికకు కాలికి గాయమై ఉండగా, విజయ్ ఆమెకు సహాయం చేయకుండా కారులో కూర్చొన్నట్లు కనిపిస్తోంది. ఇది నెటిజన్లలో తీవ్ర అసంతృప్తిని కలిగించింది.
ఈ వీడియోలో విజయ్ దేవరకొండ షాపింగ్ మాల్ నుంచి బయటకు వచ్చి కారులో కూర్చుంటే, రష్మిక మాత్రం గాయంతో కష్టంగా నడుస్తూ కార్ వరకు వెళ్తుంది. ఆమె కేవలం ఒక కాలు మీద కుంటుతూ ముందుకు వెళ్తుండగా, విజయ్ ఆమెను అసలు పట్టించుకోలేదని నెటిజన్లు మండిపడుతున్నారు.
“లైగర్, సహాయం చేయచ్చు కాదు?” అంటూ ఒకరు కామెంట్ చేయగా, “సరే, కనీసం చేతితో పట్టుకుని కార్లో కూర్చోబెట్టినా బాగుండేది” అంటూ మరొకరు విమర్శించారు. విజయ్ మంచి బాయ్ ఫ్రెండ్ గా, ఇతరులకు కూడా సహాయం చేసే మంచి వ్యక్తిగా ఇమేజ్ కలిగి ఉండగా, ఇలాంటి వీడియో అతని ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చింది.
#VijayDevarakonda and #RashmikaMandanna at the gym💥 pic.twitter.com/0KnSPbk35d
— KLAPBOARD (@klapboardpost) February 5, 2025
రష్మిక గాయం అయినప్పటికీ, ఆమె తన ప్రొఫెషనలిజాన్ని ప్రదర్శిస్తూ ‘ఛావా’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు వెళ్లింది. అక్కడ ఆమె ఒక కాలు మీద కుంటుకుంటూ నడుస్తుంటే, నటుడు విక్కీ కౌశల్ ఆమెకు అండగా నిలిచి, సర్దుకోవడానికి సహాయపడ్డాడు. అయితే, ఇదే పరిస్థితిలో విజయ్ దేవరకొండ సహాయం చేయకపోవడం నెటిజన్లను నిరాశకు గురి చేసింది.
జనవరి 12, 2025న రష్మిక జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా ఆమెకు కాలికి తీవ్ర గాయం అయిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా ఆమె నడవడానికి ఇబ్బంది పడుతోంది. అయినప్పటికీ, ఏమాత్రం తగ్గకుండా సినిమాలకు ప్రమోషన్స్ చేస్తోంది.
ALSO READ: Keerthy Suresh: పెళ్లయిన రెండు నెలలకే పెద్ద షాక్ ఇచ్చిన హీరోయిన్..!













