HomeTelugu Big Storiesకీర్తి సురేష్ న్యూలుక్‌.. నెటిజన్ల కామెంట్స్‌

కీర్తి సురేష్ న్యూలుక్‌.. నెటిజన్ల కామెంట్స్‌

14 1
టాలీవుడ్‌లో ‘నేను శైలజ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కేరళ కుట్టి.. కీర్తి సురేష్‌. తొలి సినిమాతోనే ప్రేక్షకులను కట్టిపడేసింది. అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆ తరవాత ‘నేను లోకల్’, ‘అజ్ఞాతవాసి’ సినిమాలతో మరింత ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. ఇక ‘మహానటి’ సినిమాతో సూపర్ స్టార్ హోదాను తెచ్చుకుంది.

మహానటి సావిత్రి పాత్రలో జీవించేసిన కీర్తి సురేష్.. ఆ ఒక్క సినిమాతో అందరినీ తనవైపు తిప్పుకుంది. అంతేనా, ఉత్తమ నటిగా జాతీయ అవార్డును కూడా సొంతం చేసుకుంది. ఒకప్పుడు సావిత్రి అంత అందంగా సౌందర్య కనిపించేవారని.. ఇప్పుడు కీర్తి సురేష్ కనిపిస్తోందని పొగడనివారంటూ లేరంటే అతిశయోక్తి కాదు. సావిత్రి మాదిరిగానే కీర్తి సురేష్ బొద్దుగా ఉండటమే దీనికి కారణం. అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా కీర్తి బరువు తగ్గడంతో ఆమె అభిమానులను నిరుత్సాహ పరిచింది.

తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలను పోస్ట్ చేసింది కీర్తి సురేష్. ఈ ఫొటోల్లో కీర్తి బాగా సన్నగా కనిపిస్తోంది. కీర్తిని అలా చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎవరికి తోచిన కామెంట్లు వారు చేస్తున్నారు. కీర్తి బొద్దుగా ఉంటేనే బాగుంటుందని, ఇలా బక్కచిక్కిపోతే చూడలేకపోతున్నామని అంటున్నారు. అయితే కీర్తి తన తరువాత చిత్రం కోసమే బరువు తగ్గితే తప్పకుండా ఆమె డెడికేషన్‌ను మెచ్చుకోవాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu