HomeTelugu Big Storiesఆర్జీవీ బయోపిక్‌ ఫస్ట్‌లుక్‌ మోషన్ పోస్టర్‌..

ఆర్జీవీ బయోపిక్‌ ఫస్ట్‌లుక్‌ మోషన్ పోస్టర్‌..

RGV biopic first look motioవివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో సినిమాను అనౌన్స్ చేశాడు. ఈ సారి స్వయంగా తన బయోపిక్ ప్రకటించాడు. ఈ బయోపిక్ ‘రాము’, ‘రామ్ గోపాల్ వర్మ’, ‘ఆర్జీవీ-ది ఇంటెలిజెంట్ ఇడియట్’ అనే పేర్లతో మూడు భాగాలుగా తెరకెక్కనుంది. తొలి భాగానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను నిన్న విడుదల చేశాడు. కాసేపటి క్రితం ఫస్ట్ లుక్ మోషన్ పిక్చర్ ను వర్మ విడుదల చేశారు. ఈ సినిమాను బొమ్మాకు మురళి నిర్మిస్తుండగా… దొరసాయి తేజ దర్శకత్వం వహిస్తున్నారు.

సెప్టెంబర్ లో షూటింగ్ ప్రారంభమవుతుంది. నా బయోపిక్ 3 చిత్రాల్లో ఒక్కొక్క చిత్రం నిడివి సుమారు 2 గంటలుంటుంది అంటే 3 చిత్రాలు కలిపి 6 గంటలు. 3 పార్టుల్లో ,ఒక్కొక్క పార్టు నా వేరు వేరు వయసుల్లో వేరు వేరు అంశాలను చూపెట్టబోతోంది. పార్ట్ 1 లో నా 20 ఏళ్ళప్పుడు రోల్, ఒక కొత్త నటుడు నటించబోతున్నాడు. పార్ట్ 2 లో వేరే నటుడు, పార్ట్ 3 లో నేనే స్వయంగా నటిస్తున్న అన్నారు.

పార్ట్ 1 లో… నా కాలేజ్ రోజులు, తోలి ప్రేమలు, గ్యాoగ్ ఫైట్స్ తో మొదలయ్యి శివ చేయడానికి ఎలాంటి పన్నాగాలు పన్నానన్నది ఉంటుంది. పార్ట్- 2 లో.. అండర్ వరల్డ్ తో ప్రేమాయణం. ఇది నా ముంబై జీవితంలో అమ్మాయిలు, గ్యాంగ్ స్టర్స్ ,అమితాబ్ బచ్చన్ లతో ఉన్న అనుబంధాల గురించి. పార్ట్ 3 ఇది నా ఫేయిల్యూర్లు, వివాదాలు, దేవుళ్ళ పట్ల, సెక్స్ పట్ల , సమాజం పట్ల నాకున్న విపరీత వైఖరుల గురించి తెలుపుతుంది.” అని వర్మ తన ట్విట్టర్ లో వివరించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu