ఎన్ఠీఆర్ కోసం మరో దర్శకుడు..?

టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్ ఇలా వరుస హిట్స్ తరువాత ఎన్ఠీఆర్ చేయబోయే తదుపరి సినిమా ఎలా ఉంటుందా..? అని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే జనతా గ్యారేజ్ సినిమా విడుదలయ్యి రెండు నెలలు దాటుతున్నా ఇప్పటివరకు ఎన్ఠీఆర్ తన తదుపరి సినిమా ప్రకటించలేదు.
 
త్రివిక్రమ్, పూరిజగన్నాథ్, వినాయక్ వంటి దర్శకుల పేర్లు వినిపించినప్పటికీ వాళ్లంతా తమ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండడం వలన ఇప్పట్లో ఎన్ఠీఆర్ తో సినిమా చేసే అవకాశం కనిపించట్లేదు. యువ దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పిన కథ ఎన్ఠీఆర్ కు నచ్చిందని ఆయనతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడని మరొక వార్త ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ లిస్ట్ లో మరో దర్శకుడి పేరు వినిపిస్తోంది. 
 
సూర్య హీరోగా వరుసగా సింగం సిరీస్ ను తెరకెక్కిస్తోన్న దర్శకుడు హరి పనితనం ఎన్ఠీఆర్ కు నచ్చిందని, ఇటీవల సింగం 3  టీజర్ నచ్చి హరిని పిలిచి ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ ఉంటే చెప్పమని అడిగారట ఎన్ఠీఆర్. మరి హరి కథను సిద్ధం చేస్తే వీరి కాంబినేషన్ లో హిట్ సినిమా రావడం ఖాయమనే అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.