HomeTelugu Big Storiesగ్రాండ్‌గా 'వెంకీ75' వేడుకలు.. అతిథులు వీరే!

గ్రాండ్‌గా ‘వెంకీ75’ వేడుకలు.. అతిథులు వీరే!

Grand Venky75 celebrationవిక్టరీ హీరో వెంకటేశ్ నటించిన తాజా చిత్రం ‘సైంధవ్’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2024 జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. చాలా రోజుల తర్వాత వెంకటేశ్ చేసిన యాక్షన్ మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సైలేశ్ కొలను దర్శకత్వం వహిస్తుండటం కూడా ఈ సినిమాపై ఓ రేంజ్‌లో క్రేజ్‌ ఏర్పడింది. ఇది వెంకటేశ్‍ 75వ సినిమాగా తెరకెక్కింది. ఈ స్పెషల్ మైల్‍స్టోన్‍ను సెలెబ్రేట్ చేసేందుకు సైంధవ్ మేకర్స్ నిర్ణయించారు.

Grand Venky75 2

వెంకటేశ్‌ తన సినీ కెరీర్లో 75వ సినిమా సందర్భంగా వెంకీ75 (Venky75) పేరుతో ఓ ఈవెంట్ ప్లాన్‌ చేశారు. దీన్ని భారీగా నిర్వహించాలని సైంధవ్ మేకర్స్ నిర్ణయించారు. రేపు (డిసెంబర్ 27) హైదరాబాద్‍లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో సాయంత్రం 5 గంటల నుంచి వెంకీ75 ఈవెంట్ జరగనుంది. హీరో దగ్గుబాటి రానా ఈ ఈవెంట్ పనులను దగ్గరుండి చూసుకుంటున్నారని టాక్‌. వెంకటేశ్ 1986లో కలియుగ పాండవులు సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ హీరోకు 75వ చిత్రానికి ఈవెంట్ నిర్వహించడం ఇదే తొలిసారి.

Grand Venky75 3

ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, మహేశ్ బాబు, ప్రభాస్, నాగార్జున సహా మరికొందరు హాజరవుతారని తెలుస్తోంది. యంగ్ హీరోలు కూడా చాలా మంది వస్తారని తెలుస్తోంది. అలాగే కలియుగ పాండవులు నుంచి ఇప్పటి సైంధవ్ వరకు వెంకటేశ్‍తో కలిసి పని చేసిన నటీనటులు, దర్శకులు, మ్యూజిక్ డైరెక్టర్లు సహా టెక్నిషియన్లకు ఆహ్వానం వెళ్లినట్టు తెలుస్తోంది. దర్శకులు కే.రాఘవేంద్ర రావు, బి.గోపాల్, ముప్పలనేని శివ సహా వెంకటేశ్‍తో కలిసి పని చేసిన చాలా మంది డైరెక్టర్లు ఈ ఈవెంట్‍కు రానున్నారు.

Grand Venky75 1

ఈ వేడుకకు కేవలం ఆహ్వానం అందిన అతిథులు, ఎంపిక చేసిన కొందరు అభిమానులు మాత్రమే వెళ్లే అవకాశం ఉండనుంది. అలాగే లైవ్‌ లేదు అని.. కొన్ని రోజుల తర్వాత ఈటీవీలో ఈ వెంకీ75 వేడుక టెలికాస్ట్ అవుతుందని టాక్.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu