విద్యాబాలన్ ఒప్పుకుంటుందా..?

‘డర్టీ పిక్చర్’ సినిమాతో విద్యాబాలన్ ఎలాంటి పాత్రలో అయినా.. నటించగలనని నిరూపించుకుంది. సిల్క్ స్మిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఆ సినిమాలో విద్యా తప్ప మరెవరూ నటించలేరని అందరూ నమ్మెంతలా ఆమె తన నటన కనబరిచింది. అయితే ఇప్పుడు తెలుగులో ‘సావిత్రి’ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా చేస్తున్నారు. దానికోసం నిత్య, సమంతల పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు విద్యాబాలన్ ను కూడా సంప్రదిస్తున్నట్లు టాక్.

ఈ నేపధ్యంలో విద్యాబాలన్ తన బయోపిక్ లో నటిస్తే బావుటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది సన్నీలియోన్. ఇప్పుడు ఇదొక హాట్ టాపిక్ గా మారింది. తన జీవిత చరిత్ర సినిమాగా రావాలని సన్నీలియోన్ కోరుకుంటోంది. దానికి నిర్మాతలు కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ బయోపిక్ లో సన్నీ మాత్రం నటించదట. ఈ పాత్రకు విద్యా అయితే కరెక్ట్ అని ఆమె పేరును సూచిస్తోంది. కానీ విద్యాబాలన్ మాత్రం నటించడానికి అంగీకరించదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.