2017 జనవరి రిలీజెస్!

ఈ ఏడాది మొదటి నెలలో రాబోయే సినిమాలు వాటి వివరాలు:
హీరో నాని, దర్శకుడు త్రినాధరావు నక్కిన కాంబినేషన్ లో రూపొందుతోన్న ‘నేను లోకల్’ చిత్రాన్ని జనవరి 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ కనిపించనుంది.

nenu-local

 

 

 

 

 

లక్ష్మీ మంచు నటిస్తోన్న ‘లక్ష్మీ బాంబ్’ సినిమా కూడా నాని సినిమాకు పోటీగా జనవరి 6న విడుదల కానుంది. కార్తికేయ గోపాల కృష్ణ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. థ్రిల్లర్ నేపధ్యంలో ఈ సినిమా కొనసాగుతుంది.

lakshmi-bomb

 

 

 

 

 

జనవరి 12న నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విడుదలకు సిద్ధమవుతోంది. క్రిష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా శ్రియ శరణ్, హేమామాలిని ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

balayya

 

 

 

 

 

 

 

జనవరి 13న మెగాస్టార్ 150వ చిత్రం విడుదలవుతోంది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

pand5757

 

 

 

 

 

 

సంక్రాంతి పండుగ కనుకగా శర్వానంద్ నటిస్తోన్న ‘శతమానం భవతి’ చిత్రాన్ని జనవరి 14న విడుదల చేయనున్నారు. సతీశ్ వెగ్నేస దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. అనుపమపరమేశ్వరన్, శర్వాకు జంటగా నటిస్తోంది.

sb

 

 

 

 

 

 

 

రిపబ్లిక్ డే(జనవరి 26) కానుకగా నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ కథతో రూపొందుతోన్న‘సింగం 3’ సినిమా విడుదల కానుంది. సూర్య నటిస్తోన్న సింగం సిరీస్ లో భాగంగా వస్తోన్న ఈ చిత్రానికి దర్శకుడిగా హరి వ్యవహరిస్తున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని మల్కాపురం శివకుమార్
రిలీజ్ చేస్తున్నారు.

singam3

 

 

 

 

 

 

బాలీవుడ్ రీమేక్ గా రూపొందుతోన్న వెంకీ ‘గురు’ చిత్రాన్ని కూడా జనవరి 26న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఒరిజినల్ డైరెక్టర్ సుధా కొంగర తెలుగు చిత్రాన్ని కూడా డైరెక్ట్ చేశారు.

guru