సింగం3 మళ్ళీ వాయిదా!

సూర్య ప్రధాన పాత్రలో రూపొందుతోన్న చిత్రం సింగం3. సింగం సిరీస్ లో భాగంగా వస్తోన్న సినిమా కావడంతో మొదటి నుండి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. డిసంబర్ రెండో వారంలోనే సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ రామ్ చరణ్ ‘ధృవ’ సినిమా విడుదలవుతుండడంతో ఈ సినిమాను డిసంబర్ 23కి వాయిదా వేశారు.

మరి ఆరోజైనా.. సినిమా వస్తుందని సూర్య అభిమానులు ఆశించారు. కానీ ఇప్పుడు అది కూడా జరిగేలా లేదు. కొన్ని అనివార్యకారణాల వలన సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు కొద్దిసేపటి క్రితమే సూర్య సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కొత్త డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేస్తామని అన్నారు. ఈ సినిమాలో సూర్య సరసన శృతిహాసన్, అనుష్క హీరోయిన్లుగా కనిపించనున్నారు.