ప్రియాంక, నిక్‌ల ‘విల్లా’ ధర ఎంతో తెలుసా?

స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా త్వరలో ప్రముఖ అమెరికన్‌ గాయకుడు నిక్‌ జొనాస్‌ను వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ ఉమైద్‌ భవన్‌లో వీరి వివాహం డిసెంబర్‌లో జరగబోతున్నట్లు సమాచారం. అయితే పెళ్లి తర్వాత ప్రియాంక, నిక్‌ కలిసి లాస్‌ఏంజెల్స్‌లోని ఓ విల్లాలో ఉండబోతున్నారట. బెవర్లీ హిల్స్‌ ప్రాంగణంలో ఈ విల్లా ఉంది. దీని ధర 6.5 మిలియన్‌ డాలర్లు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.47 కోట్ల పైమాటే.

ఈ విల్లాలో అన్‌గేటెడ్‌ స్విమ్మింగ్ పూల్‌, ఐదు పడకగదులు, నాలుగు బాత్రూమ్‌లు ఉన్నాయి. దాదాపు 4,129 చదరపు అడుగుల్లో ఈ విల్లాను నిర్మించారు. ప్రియాంకకు ప్రపోజ్‌ చేయడానికి కొన్ని నెలల ముందే నిక్‌ ఈ విల్లాను కొనుగోలు చేశారట. ఆగస్టు‌లో ప్రియాంక, నిక్‌ భారతీయ సంప్రదాయం ప్రకారం ముంబయిలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఉమైద్‌ భవన్‌లో జరగబోయే వివాహానికి దాదాపు 200 మంది అతిథులు రాబోతున్నట్లు తెలుస్తోంది.

CLICK HERE!! For the aha Latest Updates