HomeTelugu Trendingనిధి అగర్వాల్ సెల్ఫ్ ప్రమోష‌న్‌!

నిధి అగర్వాల్ సెల్ఫ్ ప్రమోష‌న్‌!

Nidhhi Agerwal self promoti
టాలీవుడ్‌లో ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాతో పలువురి దృష్టిని ఆక‌ర్షించింది నిధి అగ‌ర్వాల్‌. ఈ భామ ప్ర‌స్తుతం ప‌వ‌న్ క‌ల్యాణ్ నటిస్తోన్న భారీ ప్రాజెక్టు హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు లో ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఇప్ప‌టికే పూర్తి కావాల్సిన ఈ సినిమా షూటింగ్ కోవిడ్ సెకండ్ వేవ్ కార‌ణంగా నిలిచిపోయింది. ఈ మూవీ కంప్లీట్ అయ్యేందుకు మ‌రో 6 నెల‌ల వ‌ర‌కు ప‌ట్టే అవ‌కాశ‌మున్న‌ట్టు టాలీవుడ్ వ‌ర్గాల టాక్‌.

అయితే కోవిడ్ సెకండ్ వేవ్‌తో సినిమా ఆలస్య‌మ‌వుతుండ‌టంతో త‌న‌కు తానే ప్ర‌మోట్ (సెల్ఫ్ ప్రమోష‌న్) చేసుకోవాల‌ని అనుకుంటుంద‌ట నిధి. అప్ప‌టివ‌ర‌కు త‌న ఫాలోవ‌ర్లు, సినీ ల‌వ‌ర్స్ కు బోరు కొట్ట‌కుండా ఫొటోషూట్‌తో ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాలు చేయాల‌ని నిధి ప్లాన్ రెడీ చేసిన‌ట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప‌వ‌న్‌ కళ్యాన్‌తో సినిమా చేయడంతో నిధి అగర్వాల్‌కి వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నాయ‌ట‌. అయితే ప‌లువురు ఫిల్మ్‌మేక‌ర్స్ హ‌రిహ‌ర వీర‌మ‌ల్లులో నిధి న‌ట‌న‌కు వ‌చ్చే స్పంద‌న‌ను బ‌ట్టి త‌మ సినిమాల్లోకి నిధిని తీసుకోవాల‌ని అనుకుంటున్నార‌ట‌.

Recent Articles English

Gallery

Recent Articles Telugu