HomeTelugu Trendingవెంకటేష్ చేతుల మీదుగా '3 మంకీస్' మూవీ టీజర్‌

వెంకటేష్ చేతుల మీదుగా ‘3 మంకీస్’ మూవీ టీజర్‌

4 27ప్రముఖ కామెడీ షో ‘జబర్దస్త్’ ద్వారా సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లోను అవకాశాలు సంపాదించుకుంటూ వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు ప్రధాన పాత్రధారులుగా ‘3 మంకీస్’ చిత్రం రూపొందుతోంది. నాగేశ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి అనిల్ కుమార్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా నుంచి విక్టరీ వెంకటేష్‌ చేతుల మీదుగా ఒక టీజర్ ను విడుదల చేయించారు. ఈ సినిమాలో ఈ ముగ్గురూ స్నేహితులుగా కనిపించనున్నారనే విషయం ఈ టీజర్ ద్వారా తెలుస్తోంది. మందు పార్టీలు చేసుకునే బ్యాచిలర్స్ చుట్టూ తిరిగే కథతో ఈ సినిమా సాగనుంది. షకలక శంకర్ ఓ ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఈ ముగ్గురిని ఎంతవరకూ బిజీ చేస్తుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu