HomeTelugu Trendingపరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నాం: నిహారిక

పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నాం: నిహారిక

Talk Niharika is officially divorced from her husband Chaitanya
మెగా డాటర్ నిహారిక, ఆమె భర్త చైతన్య జొన్నలగడ్డ విడాకులు తీసుకున్నట్లు గతకొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలసిందే. అయితే వాటిపై ఎవరూ స్పందించలేదు. అయితే వాస్తవానికి గత నెలలోనే వీరికి కూకట్‌పల్లిలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు అయినట్టు, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా విడాకులపై నిహారిక తొలిసారి స్పందించింది.

పరస్పర అంగీకారంతోనే తాను, చైతన్య విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నామని నిహారిక ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. ఇది చాలా సున్నితమైన సమయమని… తమను ఇబ్బంది పెట్టొద్దని కోరుతున్నానని చెప్పింది. తనకు మద్దతుగా నిలిచిన తన కుటుంబానికి, స్నేహితులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని పేర్కొంది. తమ వ్యక్తిగత జీవితాలకు సంబంధించి కొంత ప్రైవసీ కోరుకుంటున్నానని చెప్పింది. అచ్చం అలాంటి పోస్టునే చైతన్య కూడా పోస్ట్‌ చేశాడు. దీంతో వీరిద్దరి పోస్ట్ లు వైరల్ గా మారాయి. అయితే వీరి విడాకులకు కారణం మాత్రం తెలియలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!