నీహారిక తండ్రిగా నాగబాబు!

నీహారిక తండ్రిగా నాగబాబు!
నాగబాబు కూతురు నీహారిక ఈమధ్యనే టాలీవుడ్ లో ‘ఒక మనసు’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. యాంకర్ గా పలు షోలు చేసిన నీహారిక ‘ముద్దపప్పు ఆవకాయ్’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. యూట్యూబ్ లో ఈ వెబ్ సిరీస్ బాగా ఫేమస్ అయింది. యూత్ లో నీహారికకు మంచి పేరు కూడా తెచ్చిపెట్టింది. దీంతో నీహారిక మరో వెబ్ సిరీస్ కనిపించడానికి రెడీ అవుతోంది. ‘ముద్దపప్పు ఆవకాయ్’ వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేసిన ప్రణీత్ కొత్త వెబ్ సిరీస్ ను కూడా డైరెక్ట్ చేయనున్నాడు. ఇది తండ్రీ కూతుళ్ల మధ్య సాగే కథగా తెలుస్తోంది. ఇందులో నీహా తండ్రి పాత్రలో నాగబాబు అయితేనే బావుంటారని ఆయనను సంప్రదించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ద్వారా తండ్రీ కూతుళ్లను ఒకే ఫ్రేములో చూడొచ్చు. 
CLICK HERE!! For the aha Latest Updates