రాజకీయ ప్రచారలపై నిఖిల్‌ ట్వీట్

యంగ్‌ హీరో నిఖిల్‌ ఓ రాజకీయ పార్టీకి మద్దతు తెలిపారని ప్రచారం జరిగింది. దీనిపై నిఖిల్‌ ట్విటర్‌లో స్పందించారు. అవన్నీ కేవలం వదంతులని, తన మద్దతు మంచి వ్యక్తులకని స్పష్టం చేశారు. ‘నేను ఓ రాజకీయ పార్టీకి మద్దతు తెలిపానని నాపై కొన్ని వదంతులు వచ్చాయి. నాకు అసలు రాజకీయాలతో సంబంధం లేదు. నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానో ఈ వీడియోలో వినండి. ధన్యవాదాలు.. జైహింద్‌’ అని నిఖిల్‌ ట్వీట్‌ చేశారు. దీంతోపాటు వీడియోను షేర్‌ చేశారు.

‘మా కుటుంబ సభ్యులైన కె. ప్రతాప్‌ డోన్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. నేను ఆయన్ను కలిసి, విష్‌ చేశా. మా అంకుల్‌కు ఓటు వేయండి అని అక్కడి వారిని అడిగా. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆ ప్రాంతానికి ఆయన చేసిన సేవ చాలా గొప్పది. మంచి వాళ్లు రాజకీయాల్లోకి రావాలి, అది ఏ పార్టీ అనేది అనవసరం. వారిని గెలిపించే బాధ్యత మనదే. నాకు తెలిసిన చాలా మంది మంచి వ్యక్తులు పోటీ చేస్తున్నారు. వారిని వ్యక్తిగతంగా కలిసి విష్‌ చేస్తాను. వారు ఏ పార్టీకి చెందిన వారనేది నాకు సంబంధం లేదు. నా వల్ల వాళ్లకి ఓట్లు వస్తాయని ఇలా మాట్లాడటం లేదు. నాకు అంత సీన్‌లేదని తెలుసు (నవ్వుతూ). ఓ పౌరుడిగా నా కృషి నేను చేస్తా. ఐదేళ్లకు ఓ సారి వచ్చే ఆయుధం ఇది. సరిగ్గా వాడుదాం’ అని నిఖిల్‌ వీడియోలో అన్నారు.