నిర్మాతగా స్పీడ్ పెంచుతోంది!

బాలీవుడ్ అందాల తార ప్రియాంకా చోప్రా.. తన సత్తాను చాటి హాలీవుడ్ లో సైతం బిజీగా
మారిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే నిర్మాతగా కూడా బిజీ కావాలని నిర్ణయించుకుంది.
అందులో భాగంగా వరుస చిత్రాలను నిర్మించడానికి సిద్ధపడుతోంది. కేవలం హిందీలో మాత్రమే
కాకుండా భారత్ గల వివిధ ప్రాంతీయ బాషల్లో సినిమాలను నిర్మిస్తోంది. పర్పుల్ పెబర్ పిక్చర్స్
బ్యానర్ పై మరాఠీలో ఓ సినిమాను రూపొందిస్తోంది. రాజేష్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో
బాలీవుడ్ డైరెక్టర్ అశుతోష్ గోవారికర్ ఓ ముఖ్య పాత్ర పోషించడం విశేషం. ఈ చిత్రానికి
‘వెంటిలేటర్’ అనే టైటిల్ ను నిర్ణయించారు. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలయింది. దీంతో
పాటు పంజాబీ, భోజ్ పురి బాషల్లో సినిమాలను నిర్మించనుంది. ఈ సినిమాలకు వచ్చే రెస్పాన్స్
ను దృష్టిలో పెట్టుకొని నిర్మాతగా తన స్పీడ్ ను పెంచాలని భావిస్తోంది.

CLICK HERE!! For the aha Latest Updates