నితిన్ మొదలుపెట్టాడు!

నితిన్, హను రాఘవపూడి కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా లొకేషన్స్ కోసం హను ఇటీవల అమెరికా వెళ్ళి వచ్చాడు. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ పైకి వెళ్తుందా అని ఎదురుచూశారు అభిమానులు. ఆ సమయం వచ్చేసింది. ఈరోజు హైదరాబాద్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేశారు. 14 రీల్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతోంది. హైదరాబాద్ లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించి ఫిబ్రవరి నెలలో అమెరికా వెళ్ళి అక్కడే రెండు నెలల పాటు షూటింగ్ జరపనున్నారు.

మే నాటికి ఎట్టిపరిస్థితుల్లో షూటింగ్ పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ‘అ ఆ’ హిట్ తరువాత నితిన్ ఆ సినిమా కంటే పెద్ద హిట్ అందుకోవాలని చాలా కథలు విని ఫైనల్ గా హను కథ ఓకే చేశాడు. హను కూడా ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’ చిత్రంతో తనలోని దర్శకత్వ ప్రతిభను నిరూపించుకున్నాడు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాపై మంచి అంచనాలనే ఏర్పడ్డాయి.