HomeTelugu Trendingనితిన్‌ కొత్త సినిమా టైటిల్‌ ఫిక్స్..

నితిన్‌ కొత్త సినిమా టైటిల్‌ ఫిక్స్..

Nithin new movie title andటాలీవుడ్‌ యంగ్‌ హీరో నితిన్‌ ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి డైరెక్షన్‌లో కొత్త సినిమాను ప్రకటించాడు. ఈ రోజు(గురువారం) డైరెక్టర్‌ కొరటాల శివ అధికారికంగా విడుదల చేశారు. ఈ సినిమా పేరు ‘చెక్‌’గా ప్రకటిస్తూ ప్రీ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘నాకు ఇష్టమైన దర్శకుడు చంద్రశేఖర​ యేలేటి, హీరో నితిన్‌ల కొత్త సినిమా ప్రీ లుక్‌ను ప్రారంభించినందుకు సంతోషంగా ఉంది’ అంటూ ట్వీట్‌ చేశారు.

వీ ఆనంద్‌ నిర్మాతగా వ్యవహిస్తున్న ఈ సినిమాలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టైటిల్ సోస్టర్‌ను చూస్తుంటే చేతికి సంకేళ్లు, చెస్‌లోని కాయిన్స్‌తోపాటు ఇనుప కంచె కన్పిస్తోంది. దీంతో డిఫరెంట్‌ జోనర్‌లో సాగే థ్రిల్లర్‌ మూవీగా, ఇప్పటి వరకు నితిన్‌ నటించిన అన్ని సినిమాల కంటే కాస్తా భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఉత్తమ జాతీయ అవార్డుతోపాటు చంద్రశేఖర్‌ రెండు నంది అవార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నారు. కాగా ప్రస్తుతం నితిన్‌ ప్రస్తుతం ‘రంగ్‌దే’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తీ సురేశ్‌ హీరోయిన్‌గా నటిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu