HomeTelugu Trendingరష్మిక విచిత్రమైన అలవాటు.. వైరల్‌

రష్మిక విచిత్రమైన అలవాటు.. వైరల్‌

9 14
ప్రపంచంలో మనిషికి ఉన్నన్ని అలవాట్లు మరో జీవికి ఉండవనడంలో అతిశయోక్తి లేదు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అలవాటు ఉంటుంది. కొందరికి మాంసాహారం అలవాటు అయితే, మరికొందరికి శాకాహారమే ఇష్టం. కొందరు స్వీట్లు తింటే.. కొందరు హాట్ మాత్రమే తింటారు. ఇలా మనుషులకు రకరకాల అలవాట్లు ఉండటం సహజం. విభిన్న రుచులు, అలవాట్లు ఉన్న జీవి మనిషి మాత్రమే అని చెప్పొచ్చు. అలాగే మన తెలుగు సినిమా హీరోయిన్ రష్మికకు కూడా ఓ విచిత్రమైన అలవాటు ఉందట. ఈ విషయాన్ని తాను తాజాగా నటించిన భీష్మ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా వెల్లడించింది. రష్మిక నితిన్‌ జంటగా నటిస్తున్న భీష్మ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇంతకీ రష్మికకు ఉన్న ఆ అలవాటు ఏమిటంటే బిస్కెట్లు తినడం. బిస్కెట్లు అందరూ తింటారు కదా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అవి మనుషులు తినే బిస్కెట్లు కాదు. కుక్క బిస్కెట్లు. ఆ.. ఆశ్చర్యపోకండి.. ఈ విషయాన్ని రష్మిక స్వయంగా వెల్లడించింది. మీ గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పండి అని ప్రశ్నించగా, ఈ కుక్క బిస్కెట్ల రహస్యం బయటికొచ్చింది. నితిన్‌ ఈ విషయాన్ని చెబుతుండగా, రష్మిక ఆయన వారించే ప్రయత్నం చేసింది. ”ప్రతి విషయాన్ని నేను ఆసక్తిగా గమనిస్తా. నాకు ఓ కుక్క పిల్ల ఉంది. అది చాలా క్యూట్‌గా ఉంటుంది. ఇంత క్యూట్‌ ఉంటుంది కదా! ఇది తినే బిస్కెట్‌ తింటే ఎలా ఉంటుందో చూద్దామని జస్ట్‌ టేస్ట్‌ చేశానంతే.. అంత అసహ్యంగా ఏమీ లేదు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో ట్రెండింగ్‌లో ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu