చరణ్ సినిమాకు నో బెనిఫిట్ షోస్!

ఓ స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ హీరో అభిమానులు అందరికంటే ముందే సినిమా చూడాలని ఆశ పడుతుంటారు. బెనిఫిట్ షో టికెట్ ఎంత ఖర్చైనా.. సరే వెనకాడరు. అసలు విషయంలోకి వస్తే.. రామ్ చరణ్ నటిస్తోన్న ‘దృవ’ సినిమా డిసంబర్ 9న విడుదలకు సిద్ధంగా ఉంది. తన గత సినిమా బ్రూస్ లీ నిరాశ పరచడంతో ఈ సినిమాపై చరణ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ముఖ్యంగా ఓవర్ సీస్ లో ఎట్టిపరిస్థితుల్లో మిలియన్ మార్క్ క్రాస్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.

అయితే సినిమా రిలీజ్ విషయంలో మెగాభిమానులకు నిరాశ తప్పడం లేదు. పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే అర్ధరాత్రి నుండే బెనిఫిట్ షో ల సందడి మొదలవుతుంది. అయితే ఈ సినిమా విషయంలో మాత్రం నిర్మాత అల్లు అరవింద్ అభిమానులను నిరాశ పరుస్తున్నాడు. ఎలాంటి బెనిఫిట్ షో లేకుండా ప్లాన్ చేస్తున్నారు. బెనిఫిట్ షో వలన సినిమా టాక్ బయటకు రావడం దాని ప్రభావం కలెక్షన్స్ పై పడడం మంచిది కాదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.