‘సై.. రా’ డైలాగ్ లీక్ అయింది!

మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా రూపొందుతోన్న చిత్రం ‘సై.. రా నారాయణరెడ్డి’. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకొన్న సంగతి తెలిసిందే. చిరు పుట్టినరోజు సంధర్భంగా.. సినిమా మోషన్ పోస్టర్ ను లాంచ్ చేశారు. మెగాభిమానులను ఈ మోషన్ పోస్టర్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తోన్న ఈ చిత్రంలోని కొన్ని డైలాగులు లీక్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఈ డైలాగ్స్ హల్ చల్ చేస్తున్నాయి. ”ఒరేయ్ నేను ఒట్టి చేతులతో వచ్చా, నువ్వు భుజం మీద తుపాకీతో వచ్చావ్.. అయినా నా చెయ్యి మీసం మీదకి పోయేసరికి నీ బట్టలు తడిసిపోతున్నాయిరా” అనే డైలాగ్ మెగాభిమానులకు తెగ నచ్చేయడంతో నెట్టింట్లో బాగా షేర్ చేస్తున్నారు. 
అయితే ఈ డైలాగ్ పై చిత్రబృందం ఇప్పటివరకు స్పందించలేదు. ఈ డైలాగ్ అధికారమైనా.. అనధికారమైనా.. క్యాచీగా ఉండడంతో ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా.. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అలానే నయనతార హీరోయిన్ గా కనిపించనుంది. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.