రాధకు కావాలనే అడ్డుపడ్డారా..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న ‘కాటమరాయుడు’ సినిమా ఈ నెల 24న విడుదల కాబోతుంది. ఈ సినిమాకు పోటీగా 29న శర్వానంద్ నటించిన రాధ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. దీంతో ఆ సినిమా రిలీజ్ డేట్ ను కావాలనే కొందరు వెనక్కి తగ్గేలా చేశారని కొందరి వాదన.నిజానికి రాధ చిత్ర నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కు పవన్ కు మధ్య కాస్త ఎడం ఉంది. అది పూడ్చేయాలని ఇండస్ట్రీకు చెందిన ప్రముఖ వ్యక్తి పవన్ సన్నిహితుడు ఒకరు ప్రసాద్ తో రాయబారం నడిపారని తెలుస్తోంది.

బివిఎస్ఎన్ ప్రసాద్ కు రాధ సినిమా కాటమరాయుడుకి పోటీగా దిగుతుందనే వార్త నచ్చలేదట. ఈ విషయంపై ఆయన కాస్త కలవర పడ్డారట. ఈ వార్తలు పవన్ తో తనకున్న బంధాన్ని మరింత పాడు చేస్తాయని రాయబారం వచ్చిన వెంటనే సినిమాను వారం తరువాత రిలీజ్ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఓ రెండు, మూడు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.