మంచి కంటే చెడే తొందరగా ఎక్కుతుంది!

కేవలం రెండే రోజుల్లో కోటి వ్యూస్ సాధించి యూట్యూబ్ లో రికార్డులు సృష్టించింది ఎన్టీఆర్ నటిస్తోన్న ‘జై లవకుశ’ సినిమా టీజర్. దీన్ని బట్టి ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఎంత ఆసక్తి ఉందో తెలుస్తోంది. అయితే తన సినిమా టీజర్ కు ఇంత ఆదరణ లభించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ఎన్టీఆర్ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చెడు అనేది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. పాజిటివ్ అంశం చాలా స్లోగా వెళ్తోంది. ఎవరైనా.. ఏమైనా చెబితే కూడా మనం మొదట నెగెటివ్ గానే ఆలోచిస్తాం. ‘జై లవకుశ’ టీజర్ నుండి కూడా మొదట నెగెటివ్ అంశం బయటకు వచ్చింది.
అందుకే జనాల్లోకి త్వరగా వెళ్లిపోయింది. చెడు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా.. మన పెద్దలు చెప్పినట్లు చెడుపై మంచే గెలుస్తుంది అని అన్నారు. ఈ చిత్ర దర్శకుడు బాబీ కెరీర్ లో చెప్పుకోదగిన హిట్ సినిమాలు లేకపోవడంతో మొదట ఈ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో సరైన అంచనాలు ఏర్పడలేదు. ఎప్పుడైతే టీజర్ విడుదలైందో.. ఇక అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ముఖ్యంగా టీజర్ లో కనిపించిన ‘జై’ పాత్రను తెరపై ఎలా ప్రెజంట్ చేశారో.. చూడాలనే ఆసక్తి అందరిలో పెరిగిపోయింది. మరి ఈ విషయంలో బాబీ ఎంతవరకు సక్సెస్ అవుతాడో.. చూడాలి!